Pages

20, ఫిబ్రవరి 2009, శుక్రవారం



తల్లి అప్యాయతికి నేను కారణం అన్నారు.



సోదరి సంబదానికి కారణం నేను అన్నారు..



తండ్రి కొడుకుల బంధానికి .కారణం నేను అన్నారు.



స్నేహంలో మదుర్యానికి కారణం నేను అన్నారు.

నేను ఎక్కడ ఉంటే అక్కడ సంతోషం అన్నారు ఈ జనం.



నన్ను ప్రధాన వస్తువు చేసారు కవికులం .

ఇంత వెలుగు వెలిగిన నేను మొహనికి మసి అయ్యాను,



వ్యామోహానికి,ఆకర్షణ అగాదంలో మునిగిపోయ్యను .



కనేప్రేమతో నన్ను కాలకూటవిషని చేసారు.



వంచనతో నేను తలవంచుకునేల చేసారు ..

యవ్వనంలో ఉన్నవారు అవుతునారు నా పాలిట యమధర్మ్రాజులు .



.నన్ను వాడుకుని చివరికి వేస్తునారు నా మిద నిందలు.



లక్ష్యాలకు దూరమయిన లక్ష్మి ..



తన స్వప్నాలకి దూరం అయిన స్వప్నిక ..



నా ముసుగులో మొహంకి బలిఅయిన బాలికలు.



దీనికీ నన్ను చేసారు బాధ్యలు

ఈ తప్పు ఎవేరిది ..



నాదా???????

ఆరవ తరగతి పిల్లవాడు ఆకర్షణతో ఆరాటపడితే ఆ తప్పు నాదా?



యవ్వనంలో ఏమి పాలుపోక ఆటవికాగంగ అబ్బాయి



అమ్మాయిలాను "యాసిడ్" పాలు చేస్తే ఆ తప్పు నాదా ??

అమ్మాయా పట్టు పరికిణాలలో ఉన్నా రోజులలో జరగలేదు ఈ దాడులు ..



మరి ఈ ప్యాషన్ మొజుల రోజులలో నా మిద ఎందుకు ఈ వింతపోకడలు ..

ఈ పోటి ప్రపంచంలో అలసిపోయాను నేను ..



ఎవేరో కాదు నేను .."ప్రేమ" ను

నన్ను అనింటికి బాధ్యయుని చేయకండి .



దయ చేసి సమాజం నన్ను బతికించడానికి కృషి చేయండి .

19, ఫిబ్రవరి 2009, గురువారం


తొలిసారి నిను చూసింది మొదలు..


..నిదుర లేక అలసిపోయాయి కనులు


వాటిని నిద్రపుచ్చడానికి జోలపాట పాడలేక .


నిను చూడాలి అన్నా ఆత్రుత ఆపుకోలేక.


..భయం,ప్రేమతో .


తొలిసారి రాస్తున ..... ప్రేమలేఖ .


ఎ తల్లి పుత్రికవో తెలియదు కానీ.


నిల్వుఎత్తు పుత్తడవి అని నాకు తెలుసు.


ఎవరి కుమారివో తెలియదు కానీ.


ఎంతటి సుకుమరివో తెలుసు నాకు.


వలచి వచ్చిన వరుడుని వద్దు అనక.


..తప్పుల ఉంటే


అవి ఒప్పులగా బావించి


చప్పున బదులు ఇవ్వు ..ఇవ్వు..

తలపుల తలుపులు తీసిన ఓ మరుమల్లి.


నీ వేపే వస్తుంది నా వయసు బ్రహ్మచేర్యం వదిలి .

నీ జత కోరుకునే,నిన్ను పతిలగా ఎల్లుకునే నాకు నువ్వు మనస్సు ఇస్తే .


ఇచ్చినటు మాట ఇస్తే.


వెంటనే బదులు ఇవ్వు.


…………….వెంటనే బదులు ఇవ్వు.

ఎవేరో..

అతను ఎవేరో..

నిదురే పొత్తున ఎదనే తడిమేడు………………… (Female)

ఎవేరో

తను ఎవేరో .

నా ఎదనే కదిపింది ................................................(Male )

(1 chranam)

అణువణువు అతని తలుపే ..

మనసంత అతని మోము .

నాలో ప్రేమ భావన కలిగించేసాగే..

ఆమె పరిచయం కల్గించన పరవశం ..

నా ఉహలోలో ఉగుతున్న ఆమె ఉసులు ..

నన్ను అమెవేపు నడిపించ సాగే……..

(పల్లవి)

ఎవేరో…….

ఆమె ఎవేరో ..

నా ఎదనే గిల్లి..

నాలో ఆర్ధబాగం అయ్యే చిన్నదిదిదిదిదిది .........(MALE)

(2 charanam)
తోలివలపు మనస్సు కి ఎంతో తికమక.

.చెలి మనస్సు కోసం ప్రాయం తపించే ప్రతిక్షణం…


అతనే ఎదురయితే మనస్సు అవుతుంది ఎగిరిపడే కెరటం.

అతని నీడకోసం దానికి ఆరాటం ..

ఇది అంతే చేసింది.

(Pallavi)

ఎవేరో .??

అతని ఎవేరో...నా ప్రేమని గెలిచి .

నన్నే తీసుకువెళడానికి ఎప్పుడు వస్తాడో?...........(Female)

Ending with background music

ఎవేరో........ఎవేరో.......తన్ను ఎవేరో..ఎవేరో ..అతని ఎవేరో ............

18, ఫిబ్రవరి 2009, బుధవారం





ఏమిటో మనిషి తత్త్వం .




..ఎక్కడ లేకుండా పోయింది మానవత్వం,




అందం దేవుడు మనిషికి ఇచ్చిన అబరణం.




కానీ అలంకరణాలతో చేస్తున్నాడు బారం.




...చివరికి బూడిద అవుతుంది అని తెలిసిన కాయం




అస్తిపాస్తులు వేయాలి అనుకుంటాడు వెనుకకి ..




..మృతువ్యు తన వెనకాలే ఉంది అని తెలిసిన మనసుకి .




పక్కవాడిని దోచుకోవడం అయింది అలవాటు .




..తానూ చనిపోయినపుడు తీసుకువెళ్ళాడు అని తెలిసి ఏమి ఆ ఏమరపాటు ??




ప్రేమ,అప్యాతలు చేస్తునాడు దూరం.




కానీ అవే చిరజీవిని చేస్తాయి తనని కబళించిన మరణం .




ఈ కొద్ది కాలంలో తనకి కావాల్సింది సమకుర్చుకోడు ..




అందరి కన్నా అవుదాము అనుకుంటాడు సంపదనపరుడు .




.......యమపాశంతో రెడీగా ఉనాడు అని తెలిసిన??? యముడు..




జననమరణాల మద్య ఉన్నా ఈ తక్కువ సమయంలో ఎందుకు మనిషికి ఆశ..




ఆశ లేక పోతే మనిషి బతకలేడని సృస్తికర్తకి కి తెలుసా??????




ఏమో అదే అయి ఉండచు బహుశ!!!!

17, ఫిబ్రవరి 2009, మంగళవారం



ఏమని చెప్పను ????



నువ్వు లేవు అన్నది అయితే నిజం.



ఇక నా జీవితం నిస్తేజం..



నా గుండె "సవ్వడి" వడి వేగం అయింది అని అడిగితే ..



ఏమని చెప్పాను..

నా పెదవులు .."చిరునవ్వు" ఏది అని అడిగితే ..



ఏమని చెప్పను.

నా “కనులు” కాంతి ఏది అని అడిగితే .



ఏమని చెప్పను.

నా “పాదములు” అడుగులు ఎటు వేపు అని అడిగితే ..



ఏమని చెప్పను.

నా “మాటలు” ఇందులో బావం ఏది అని అడిగితే .



ఏమని చెప్పను.

నా చేతులు "చలనం" ఏది అని అడిగితే ..



ఏమని చెప్పను.

నా “జీవితం” బావిష్యతు ఏమి అని అడిగితే .



ఏమని చెప్పను.

నన్ను వదిలి వెళ్ళిన ఓ ప్రియతమా .





వీటికి సమాధానాలు ఎవేరు చెప్పుతారు నాకు దూరం అయిన వసంతమ్మా!!


నువ్వు లేక పోతే నేను లేను అన్నా ఓ ప్రియతమా ..





నన్ను ఈ విదముగా వదిలి వెళ్ళడం న్యాయమా .!!!!!





నువ్వు లేక పోతే ఎలా గడుస్తుంది అనుకునావు ..





నా జీవనగమనం..
.
నువ్వు లేనిది నాకు నరకం



ఈ భూతలం .



నా శ్వాస, ఆశ లేన్నపుడు నేను ఇక్కడ ఉండడం కాదు సరి.





ఓ ప్రియతమా వస్తున్నా నీ కోసం వదిలి ఉపిరి ...
http://sannidhipandu.blogspot.com/

మిత్రమా,



ఆ తామరాకు అందం నీటి భాష్పాలు..



నా కనులకు అందం నిన్ను చూడగానే నాకు వచ్చే ఆనంద భాష్పాలు ..



తామర సమూహం అందరికి కలిగించు కనువిందు ..



నా కనులకు ఆనందం నువ్వు ఉంటే నా ముందు ..



వర్షంలో వర్ణాల హరివిల్లు ఎంతో అందం .



నా వయస్సుకి సంతోషపు వర్ణాలు ఇచ్చింది మాత్రం నీ స్నేహబందం .

సరస్సులో సేద తీరటం హంసల దినచర్య ..



నీ స్నేహపు సరస్సులో సేద తీరటం తప్ప నాకు తెలియదు ఎ చర్య ..


అమ్మ,చెల్లి దూరముగా ఇక్కడికి వచ్చి అయ్యాను ప్రేమఒయాసిస్ లేని ఎడారి .


..కానీ అట్టువంటి ఎడారిలాంటి నా జీవితంలోకి నీ స్నేహం ఓ తొలకరి ..

అన్ని చోట్ల ఉండలేక అమ్మని ఇచ్చాడు ఆ దేవుడు.



అమ్మ అలిసిపోయినపుడు మనకి తోడువుండే వాడు మాత్రం ....మిత్రుడు.

12, ఫిబ్రవరి 2009, గురువారం

VALENTINE's DAY


Feb 14



ప్రేమికుల రోజు..



ప్రేమ""కులస్తులకు "" పండుగ రోజు..



తను వెంటపడే అమ్మాయిలలో ఎవేరికి ప్రేమలేఖ



ఇవ్వాలో తెలియక అబ్బాయిలు అవుతారు



Confusee...


ఇదే అవకాశం అని అమ్మాయిలు ఇస్తారు ఫొజూ .


ఈ రోజు అబ్బాయి ప్రేమ ఒపుకుంటే అతడే భూమికి రాజు..



ఒపుకోకపోతే మళ్లి busstop కి ప్రతి రోజు.



అమ్మాయి అతని ప్రేమని ఒపుకోకపోతే ఎపట్టిలగా ఆమె life avrageee




..ఒపుకుంటే అతని పర్సు దయవల్ల ఆమె సుఖాలకు ఉండదు



pauseee

ప్రేమలో ఉన్నా వాళ్ళకి ఈ రోజున Money Loose...


కానీ బయటికి మాత్రం నీకన్నా ఎవేరు ఎక్కువ అంటు చూపిస్తారు HighRange



so friendzz..

మనకి ఎందుకు ఈ moneylosse &confuse..



హ్యాపీగా చేసుకుందాము arranged marriage..




5, ఫిబ్రవరి 2009, గురువారం


నువ్వు కానరాక ముందు ..



నా సరి జోడు కోసం నా కనులు చేసాయి అన్వేషణ .



నా మదిలోని భావాలు ఎవేరు లేక వాటికీ అవి జరుపుకున్నాయి సంబాషణ .




దారి తోచక నా అడుగులు నడిచాయి తలో దిక్కున ..



ఇన్ని రోజులుగా నా మనుస్సు చేసింది నీ కోసం నిరీక్షణ .



నిన్ను చూసిన ఆ తోలి నిమిషాన ..



నాకు లేదు నీ మీద ఎటువంటి ఆలోచన ..



కానీ నీ స్నేహం నిన్ను కూర్చోబెట్టింది నా మదినా..



కానీ అది చెప్తే నువ్వు ఏమి అంటావో అని భయం అణువు అణువునా ..



కానీ నేను తట్టుకోలేను విరహం అనే పిడుగులతో నువ్వు కురిపించే ప్రేమవాన ..



అందుకే.........




నా మది మల్లెల తోటలో సరాగాలు వినిపించిన ఓ వయ్యారి వీణ..



నా ప్రేమని నీకు చెపుతున్న ఈ ప్రేమికుల రోజునా .....



నువ్వు నా ప్రేమని ఒప్పుకుంటావు అనుకుంట్టున...



లేక పోతే ఇంతే రాసాడు అనుకుంటాను ఆ విధాత నా నుదుటున..

 

Blogger news

Blogroll

About