తల్లి అప్యాయతికి నేను కారణం అన్నారు.
సోదరి సంబదానికి కారణం నేను అన్నారు..
తండ్రి కొడుకుల బంధానికి .కారణం నేను అన్నారు.
స్నేహంలో మదుర్యానికి కారణం నేను అన్నారు.
నేను ఎక్కడ ఉంటే అక్కడ సంతోషం అన్నారు ఈ జనం.
నన్ను ప్రధాన వస్తువు చేసారు కవికులం .
ఇంత వెలుగు వెలిగిన నేను మొహనికి మసి అయ్యాను,
వ్యామోహానికి,ఆకర్షణ అగాదంలో మునిగిపోయ్యను .
కనేప్రేమతో నన్ను కాలకూటవిషని చేసారు.
వంచనతో నేను తలవంచుకునేల చేసారు ..
యవ్వనంలో ఉన్నవారు అవుతునారు నా పాలిట యమధర్మ్రాజులు .
.నన్ను వాడుకుని చివరికి వేస్తునారు నా మిద నిందలు.
లక్ష్యాలకు దూరమయిన లక్ష్మి ..
తన స్వప్నాలకి దూరం అయిన స్వప్నిక ..
నా ముసుగులో మొహంకి బలిఅయిన బాలికలు.
దీనికీ నన్ను చేసారు బాధ్యలు
ఈ తప్పు ఎవేరిది ..
నాదా???????
ఆరవ తరగతి పిల్లవాడు ఆకర్షణతో ఆరాటపడితే ఆ తప్పు నాదా?
యవ్వనంలో ఏమి పాలుపోక ఆటవికాగంగ అబ్బాయి
అమ్మాయిలాను "యాసిడ్" పాలు చేస్తే ఆ తప్పు నాదా ??
అమ్మాయా పట్టు పరికిణాలలో ఉన్నా రోజులలో జరగలేదు ఈ దాడులు ..
మరి ఈ ప్యాషన్ మొజుల రోజులలో నా మిద ఎందుకు ఈ వింతపోకడలు ..
ఈ పోటి ప్రపంచంలో అలసిపోయాను నేను ..
ఎవేరో కాదు నేను .."ప్రేమ" ను
నన్ను అనింటికి బాధ్యయుని చేయకండి .
దయ చేసి సమాజం నన్ను బతికించడానికి కృషి చేయండి .
mee padalalo jeevam unnadi
రిప్లయితొలగించండిnaaku chaala nachindi amogham mee vyakhyaalu..:)