Pages

17, ఫిబ్రవరి 2009, మంగళవారం


మిత్రమా,



ఆ తామరాకు అందం నీటి భాష్పాలు..



నా కనులకు అందం నిన్ను చూడగానే నాకు వచ్చే ఆనంద భాష్పాలు ..



తామర సమూహం అందరికి కలిగించు కనువిందు ..



నా కనులకు ఆనందం నువ్వు ఉంటే నా ముందు ..



వర్షంలో వర్ణాల హరివిల్లు ఎంతో అందం .



నా వయస్సుకి సంతోషపు వర్ణాలు ఇచ్చింది మాత్రం నీ స్నేహబందం .

సరస్సులో సేద తీరటం హంసల దినచర్య ..



నీ స్నేహపు సరస్సులో సేద తీరటం తప్ప నాకు తెలియదు ఎ చర్య ..


అమ్మ,చెల్లి దూరముగా ఇక్కడికి వచ్చి అయ్యాను ప్రేమఒయాసిస్ లేని ఎడారి .


..కానీ అట్టువంటి ఎడారిలాంటి నా జీవితంలోకి నీ స్నేహం ఓ తొలకరి ..

అన్ని చోట్ల ఉండలేక అమ్మని ఇచ్చాడు ఆ దేవుడు.



అమ్మ అలిసిపోయినపుడు మనకి తోడువుండే వాడు మాత్రం ....మిత్రుడు.

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

 

Blogger news

Blogroll

About