Beauty is only skin deep …..
యవ్వనం. మనిషి ఆలోచనే లేకుండా..
Future గూర్చి ఫికర్ లేకుండా..జాలీగా ఎంజాయ్ చేసే కాలం...
ఇలాగే ఎంజాయ్ చేస్తున్నాడు మన
వాడు..
ఈ కధకి మూలపురుషుడు .. నా మిత్రుడు........గోపాల్ కృష్ణుడు ..
పేరులో ఉంది గోపాలం.ఎప్పుడు సుందరిమణులతో గడుస్తుంది వీడి కాలం ..
అనుకుంటే వేసినట్టే మీరు
పప్పులో మీ పాదం .
ఏమి చేస్తాము.. మన వాడి పేరులో కృష్ణుడు ఉన్నా ..
మన వాడి జీవితపు వాకిలిలోకి ఇప్పుడు దాక ఎ గోపిక గుమ్మం తొక్కలేదు ..
మర్చిపోయా మీకు చెప్పడం..మనవాడు సరస్వతి పుత్రుడు.సరస్వతి అంటే వల్ల అమ్మ పేరు
అనుకుంటున్నారా ..కాదు... మన వాడు బాగా చదవుతాడు ..
BTECH దాక అమ్మాయిలను వీడు పట్టించుకోలేదు ఆ తరవాత...ఇప్పుడు ఎ అమ్మాయి వీడిని
పట్టించుకోలేదు
అది మన హీరో Introduction... ఇప్పుడు అసలు కధ కి వస్తే..
చెప్పడం మరిచాను అండీ .మనవాడు ..Software engineer..
అయితే ఇంక వీడికి పెళ్లి ఏమి అవుతుంది అనుకుంటున్నారా ..
తప్పు లేదు మీరు అలా అనుకోవడం లో..
............................................................................................................
ఆ రోజు ఉదయం ఎప్పటి లగా ఆఫీసు కి బయలదేరాడు..మన వాడు .
నిట్టిగా ఫార్మల్ డ్రెస్ లో.మెళ్ళో టై తో
(తను దూరడానికి సందు ..లేదు ..మెళ్ళో డోలు అనట్టు లేదు ఇది ..ఏమి చేస్తాం..)
వీడి బిల్డుప్ చూస్తే ఈ benze carlo వెళ్తారు అనుకునారే.. అమ్మా..
సిటీ బస్stop లో సిటీ బస్ కోసం వెయిటింగ్...
చెప్పను కాదా మన వాడు SE..
ఇంతలొ నిన్నే కొన్న కొత్త మొబైల్ మ్రోగింది ..
కవ్వించే ప్రేమికా .........................
ఏమిటి ఈ ప్రేమిక ఎవేరు అనుకుంటున్నారా ..
ఇక్కడ ఎవేరు లేరు..అది మన వాడి రింగ్ తోనే..
ఫోన్ లిఫ్ట్ చేయగానే ..ఒక మధుర కంఠం .."Hello can I speak to rani"..
మన వాడు ఇక్కడ ఫ్లాట్..ఎందుకు అంటే ..ఆడపిల్ల కదా !!..
ఇంక మన వాడు రేచిపోదాము అని ఫిక్స్ అయీ..
"hi this is not rani..may i know who is speaking?"
అటు వేపు నుంచి "this is bhargavi..sorry for disturbing u..this is not rani number?"
ఇటు వేపు నుంచి మన కృష్ణుడు
(మనసులో ఇంక మనకు వచ్చిన English ఆయిపోయింది అనుకున్ని )
"కాదు .నా పేరు గోపాలకృష్ణ ..మీరు నన్ను మాత్రం గోపాల్ అని
(అబ్బ ..ఆ అమ్మాయి ఏదో వీడి లవర్ లాగా..ఫీలింగ్ )
భార్గవి "ఓ గోపాల్ ..ఓకే..సారీ ఏమి అనుకోకండి ..
మా ఫ్రెండ్ wrong నెంబర్ ఇచ్చింది.. మీరు ఏమి చేస్తారు?
i mean జాబు ఆర్ స్టూడెంట్ ..అని.."
కొత్తబంగారులోకం సినిమాలో హీరోయిన్ కి అక్క లాగా ..సాగాదిస్తూ అడిగింది ..
భారు (అదేనండి మన వాడి భార్గవి ) ఇంక మన వాడు మొదలు పెట్టాడు..
తన చిన్నప్పుడు అమ్మమ్మ చీర తడపడం నుంచ..
మొదలుపెట్టి. తన జీవిత పుస్తకం ఆమె ముందు ఉంచాడు..
మన భారు "వహ్వా..మీరు చాల గ్రేట్ అండి..మీరు ఎక్కాడా ఉంటారు?
మీరు married?( ఏమి లేక పోతే ఇవిడపెళ్లి చేసుకుంటుందా? )
మీరు రోజు నాతొ మాటలాడతార..లెక్క పోతే చాట్ చేస్తారా.."
Nice talking to u...”
Sure...నేను మీతో చాట్ చేస్తాను ఓకే నా ..
.నేను నిన్ను అని పిలుస్తాను ఓకే నా భారు
(అబ్బో మన వాడు బాగా క్లోజ్ అయాడు అనుకుంట)
భారు "ఓకే ..మనం ఇప్పడు మంచి ఫ్రెండ్స్ కాదా..మీరు కాదు నువ్వు నన్ను భారు
పిలవచ్చు ..గోపాల్ ..కాదు గోప్ప్ బాగుందా గోప్ప్ ??
నిక్ నేమ్.. ( గోప్ప్ ఆ? ఏమిటి అది ఏదో పాప్స్ లాగా )
మన గోప్ప్ "సూపర్..చాల బాగుంది..భారు.."
"గోప్ప్ ..నేను నీతో చాట్ చేయలేను.."
"ఏమి బంగారం..(ఓరిని ..అప్పుడే బంగారం? ) ఏమి అయింది "
"నాకు మెసేజ్ ఆఫర్ లేదు..కన్నా "(అమ్మో ...కన్నా...ఇంక ఎన్ని కన్నాలు పెడుతుందో వీడి జేబుకి )
"భారు..నేను వేయిస్తాను ..నో ప్రోబ్స్ OK ..,"
"థాంక్స్ రా కన్నా "
ఇంక ఆ రోజు స్టార్ట్ అయింది...లవ్ స్టొరీ ఇన్ ఫోన్.. అది ఏమిటి లవ్ అంటునాను ..అనుకున్నారా?
మరి...చూడకుండా ..మన వాడు .అమ్మాయి కంఠం ..కి పడిపోయాడు..
మన వాడి మాటలకూ భారు..కూడా... పారు
అయింది ..ఈ దేవదాస్ కోసం ఇంక సాంగ్స్ ..Duiets...
ప్రియ నిను చూడలేక..
ఉహలో ..నీ తలపు రాక....అని...మన వాడి కవితలు కూడా రాసేవాడు..
భారు కోసం
భార్గవి..
నీ స్వరం నన్ను చేసింది..కవి..
నాలో ప్రేమవెల్లుగులు తీసుకువచిన రవి..
నువ్వు లేక్కపోతే నాకు ..ఆ ప్రదేశం అడవి..
(..అంటే వీడు ఇప్పుట దాక ఎక్కడ ఉన్నాడు
మరి..అడవిలోన? )..
దీనికీ మన భారు .పారు కి మన వాడి మిద ప్రేమ పొంగిపోయాది.
ఒక శుభదినమున గోప్ప్,భారు కలుద్దాము అని డిసైడ్ అయ్యారు..
భారు HYD వస్తాను అంది...ఆ రోజు..మన వాడు ..రెడీ అయ్యి..మేఘలో తేలుతూ ..వెళ్ళాడు..
భారు తన ఇష్టం అయిన పింక్ కలర్ డ్రెస్ వేసుకురమనాడు.
గోప్ప్ కూడా భారు కి ఇష్టము అయిన బ్లాకు కలర్ షర్టు వైట్ ఫాంట్ వేసుకువేల్లడు..
గుండెలో టెన్షన్ మన వాడికి..ఎలాగో ఉంటుంది అని భారు..
( లవ్ చేసినప్పుడు లేదు ఇది??...ఏమిటో లోకం)
ప్రతి 5min కి క్రాఫ్ దువుకుంటూ ..వెయిట్ చేస్తునాడు మన దేవదాస్..
గోప్ప్
అపుడే వచ్చింది...ఒక అమ్మాయి మన వాడి ముందుకి.."హాయ్ ..నువ్వు,,మీరు..గోపాలకృష్ణ?
"వీడి మాములుగా "అవును మీరు ??""
ఓ నేను అండీ ..మీ భారు అదే భార్గవి..అమలాపురం
."అంతే .. 'సునామీ కల్లముందుర ఉనట్టు పెట్టాడు..మన వాడు మొహం.. '
భూమి ముక్కలయి తనని తిసుకువేలిపోతే
బాగున్ను అనుకునాడు..మన కృష్ణుడు..'ఏమిటి ఏమి అయింది అనుకుంటునారా!!!
ఏమి ఉంది...మన వాడు కలలు కన్నా అమ్మాయి...బాపు బొమ్మ.
..కానీ అమ్మాయి మాత్రం..మన వాడి కళ్ళకి సంక్రాతి గొబ్బమ్మ ల ఉంది.
.ఇపటికే ఆర్ధం అయ్యి ఉంటుంది
మీకు .. అవును మీరు అనుకునది కరెక్ట్..
ఆ అమ్మాయి చూడడానికి అంత అందముగా లేదు.. ..
నల్లని శరీర ఛాయతో ..సన్నని శరీర ఆకృతితో ..ఉంది మన
భారు..సారీ మన వాడికి కోపం వస్తుంది ..అదే అండీ మన భార్గవి..
ఇంక మన వాడికి ..అక్కడ ఒక్క నిమిషం కూడా ఉండబుద్ది కాలేదు.. ..
"హాయ్ భార్గవి...ఎలా ఉన్నావు అన్నాడు "?
ఏదో కొత్త అమ్మాయి ని పల్లకరిస్తునట్టు..
"నేను బాగున్నాను గోపప్ ..పద వెళ్దాము restuarant కి..నాకు ఆకలి అండి
"భార్గవి..
"ఒక్క నిముషం ..నేను ఇప్పుడే వస్తాను.."OK.. అని గోపాల్ బయల్దేరాడు..
మన వాడు ఎలాగా అయిన తపించ్చుకోవటానికి చూస్తునాడు .
మనస్సు అంత చిరాకుగా .ఉంది గోపాల్ కి .
ఆ చిరాకులో..టెన్షన్ లో ఏదో ఆలోచిస్తూ ..రోడ్ దాట పోయాడు ..మన కృష్ణుడు..
అంతే.. ఎదురగా ఒక కార్ వచ్చి ..గోపాల్ ని గ్రుది ఏమి తెలియనట్టుగా వేగంగా వెళ్లి పోయింది..
చివరిసారిగా ..""గోపాల్ "".....అన్నా భార్గవి పిలిచినా ,,పిల్పు వింటూ ..సృహ కోల్పాయాడు …
గోపాల్..
వారం రోజులు కోమాలో ఉన్నాడు గోపాల్..
ఒక రోజు గోపాల్ కి మేల్లుకువ వచ్చింది ..కళ్ళ ఎదురగా నేను,మా ఫ్రెండ్స్..
వాడు మమ్మల్ని అడిగాడు ఏమి అయింది అని.
ఏమి లేదులే అంతే OK..నువ్వు రెస్ట్ తీసుకో అన్నాము
వాడు సరే అని ..కళ్లు మూసుకున్న సమయంలో ..
ఎదురగా ..భార్గవి..కనపడింది.. వాడి కళ్ళలో నేను చేపలేని బాధ చూసాను ఆ సమయం లో..
భార్గవి వేపు చేయి పెట్టి "ఎందుకు వచ్చింది అనట్టు "సెగా చేసాడు.
.గోపాల్. అప్పుడే అక్కడ ఉన్నా డాక్టర్
అన్నాడు..
"SEE మిస్టర్..ఆ అమ్మాయి నిన్ను ఇక్కడ జాయిన్ చేసింది..
నీకు బ్లడ్ కావాలి అన్నపుడు...కూడా
నీకు బ్లడ్ ఇచ్చి నిన్ను కాపాడింది ..." అవును రా ! గోపాల్...ఈ వారంరోజులు నీ పక్కనే ఉంది నీకు సేవ
చేసింది..భార్గవి.అని అన్నాను నేను..
అప్పడు వాడి కళ్ళలో కనపడ్డ పశ్చాత్తాపం నేను ఎప్పటికి మరువను..
ఆమె మంచి మనస్సుని చూడకుండా..ఆమె
భాహ్య అందమునకు భయపడి .పారిపోయాను..కానీ ఆమె నన్ను కాపాడిన దేవత,..
నన్ను క్షమించు భార్గవి..అని బోరున విలపించాడు..
గోపాల్..దానికి..భార్గవి..తన గుండెల మిద కి తీసుకుని..చిన్న
పిల్లాడిని లాలిఇంచునట్టు..లాలించింది ..
తన బాధను కన్నీటి రూపంలో వదిలేస్తే తన మనస్సు కుదుట
పడుతుంది .అని. మేము ఏమిఅనకుండా వారి ఇద్దరికీ ఏకాంతం ఇచ్చి మేము వచేశాము ..
ఏమిటి ఆ
మొహాలు...చాలు ఇంకా ..కధ సుఖాంతం ..,
మరి !! ఆ మొహాలు మార్చండి..
................
కానీ ఒకటి.మాత్రం నిజం FRIENDS.
Beauty is only skin deep …..
chaala bagundi andi idi ..[:)]
రిప్లయితొలగించండిmeeru rastunna vidanam , kathanam naaku chaala baaga ncachindi